V Srinivas Goud : 30 కిలోల ‘సందె రాయి’ ఎత్తిన మంత్రి
యువకులతో పోటీ పడిన శ్రీనివాస్ గౌడ్
V Srinivas Goud : తెలంగాణ ఎక్సైజ్ , క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ అరుదైన ఫీట్ సాధించారు. ఆయన స్వతహాగా క్రీడాకారుడు. ఆయనకు క్రీడలంటే ప్రాణం. ఎమ్మెల్యేగా గెలుపొందాక పాలమూరు పట్టణ అభివృద్దికి రూట్ మ్యాప్ తయారు చేశారు. మంత్రిగా కొలువు తీరాక ప్రగతి పథంలో పయనించేలా చేశారు. ఆయన అపర భక్తుడు కూడా. తాను అనుకున్న పని జరిగిందంటే వెంటనే తిరుమలకు వెళతారు.
ఆపద మొక్కుల వాడిగా పేరు పొందిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ద పుణ్య క్షేత్రం దేవసూగూరులో కొలువై ఉన్న శ్రీ ఎల్లమ్మ దేవాలయాన్ని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. పూజలు చేసిన అనంతరం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సందె రాయి పోటీల్లో పాల్గొన్నారు మంత్రి.
ఆ ఆట గురించి అడిగి తెలుసుకున్నారు. 30 కిలోల బరువు కలిగిన సందె రాయిని శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) ఒకే ఒక్క చేత్తో లేపారు. అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్థానికులు, యువకులు , పోటీలో పాల్గొన్న వారంతా చప్పట్లతో ఉత్సాహ పరిచారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను. ఎంతైనా మంత్రా మజాకా అని మరోసారి తన సత్తా ఏమిటో చూపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Rakesh Tikait : సీఎం ధామితో టికాయత్ భేటీ