Arvind Kejriwal : ఉగ్రవాదులు ఎవరో దేశానికి తెలుసు – కేజ్రీవాల్
బీజేపీ కామెంట్స్ పై ఢిల్లీ సీఎం సీరియస్
Arvind Kejriwal : ఈ దేశంలో ఎవరు ఉగ్రవాదులో, ఎవరు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చ గొడుతున్నారో 137 కోట్ల భారతీయులందరికీ తెలుసన్నారు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ కొత్త స్లోగన్ తో పవర్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆప్ చీఫ్.
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో తిష్ట వేసిన కేజ్రీవాల్ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. అక్కడ పూర్తిగా బంపర్ మెజారిటీ సాధించి ప్రతిపక్షాలకు విస్తు పోయేలా షాక్ ఇచ్చారు. ఈ తరుణంలో ప్రస్తుతం గుజరాత్ లో ఫుల్ ఫోకస్ పెట్టారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). అక్కడ ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నారు.
ఇప్పటికే పలు మార్లు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ డిక్లేర్ చేసింది. డిసెంబర్ 1, 5 తేదీలలో రెండు విడతులుగా పోలింగ్ చేపట్టనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉండేది. కానీ కొత్తగా మరో పార్టీ ఆప్ కూడా వచ్చి చేరింది.
ఈ తరుణంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఆప్ మూడో పార్టీగా తన అదృష్టాన్ని పరీక్షించు కోనుంది. ఇక రాష్ట్రంలో 27 ఏళ్లుగా పవర్ లో ఉన్న బీజేపీ ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో బీజేపీ వర్సెస్ ఆప్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
తనను అరాచక వాది అని, అక్రమాలకు కేరాఫ్ అంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : యోగి కామెంట్స్ అల్కా లాంబా సీరియస్