Noida Supertech Towers : క‌ళ్ల ముందే ట‌వ‌ర్ల‌ను కూల్చేశారు

9 ఏళ్ల యుద్దానికి ముగింపు నేటితో

Noida Supertech Towers :  ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని నోయిడా లో నిర్మించిన సూప‌ర్ టెక్ జంట ట‌వ‌ర్ల‌ను(Noida Supertech Towers)  ఎట్ట‌కేల‌కు కూల్చి వేశారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జ‌రిగింది. 9 ఏళ్ల పాటు యుద్దం కొన‌సాగింది.

కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా వెళ్లింది. చివ‌ర‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం కీల‌క తీర్పు చెప్పింది. కూల్చేయ‌మంటూ ఆదేశించింది.

కూల్చివేత‌కు సంబంధించి సూప‌ర్ టెక్ జంట ట‌వ‌ర్ల కూల్చివేత క‌స‌ర‌త్తు ముందుగా ఆగ‌స్టు 21న ప్రారంభం కావాల్సిఉంది. కానీ 28న ముహూర్తం ప్రారంభ‌మైంది.

నోయిడా అథారిటీ అభ్య‌ర్థ‌న‌ను కోర్టు అంగీక‌రించింది. కూల్చ వేత తేదీని పొడిగించాల‌ని కోరింది. ఈ మేర‌కు ఓకే చెప్ప‌డంతో ఆదివారం ఆకాశ హార్మ్యాల‌ను త‌ల‌పింప చేస్తూ వచ్చిన జంట ట‌వ‌ర్లను కూల్చి వేశారు.

అపెక్స్ ట‌వ‌ర్ లో 32 అంత‌స్తులు ఉండ‌గా సెయానే లో 29 అంత‌స్తులు ఉన్నాయి. ట‌వ‌ర్ల‌ను కూల్చి వేయ‌డం వ‌ల్ల దాదాపు 35,000 క్యూబిక్ మీట‌ర్ల శిథిలాలు మిగిలి పోయాయి.

అయితే కూల్చివేశారు స‌రే కానీ వీటి కార‌ణంగా మొత్తం ఎత్తి పోయాలంటే , మ‌ట్టి, సిమెంట్, కంక‌ర‌, ఐర‌న్ ను , త‌దిత‌ర వాటిని క్లియ‌ర్ చేసేందుకు క‌నీసం మూడు నెల‌లు ప‌డుతుంది.

ఇవాళ మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు కూల్చివేత ప్రారంభించారు. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ చ‌రిత్ర‌కు ముగింపు ప‌లికింది. ఇదిలా ఉండగా పేలుడు ప‌దార్ధాల‌తో జంట ట‌వ‌ర్ల‌ను కూల్చేసేందుకు ఇప్ప‌టికే సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది.

కాగా దీనిని క‌వ‌రేజ్ చేసేందుకు మీడియా సిబ్బంది విధిగా ఐడీ కార్డుల‌ను క‌లిగి ఉండాల‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.

Also Read : లంకకు మ‌ద్ద‌తు కావాలి ఒత్తిడి కాదు

Leave A Reply

Your Email Id will not be published!