Udayan Guha : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా పశ్చిమ బెంగాల్ లో ప్రారంభించిన వందే భారత్ రైలు ఇప్పుడు వివాదానికి దారి తీసింది. దీనిపై అధికారంలో ఉన్న టీఎంసీ విమర్శలు గుప్పిస్తే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం కావాలని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండి పడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా సంచలన ఆరోపణలు చేశారు మంత్రి ఉదయన్ గుహా(Udayan Guha).
సాధారణ రైలు కంటే అధ్వాన్నంగా ఉందన్నారు. అంతే కాదు పాత రైళ్లకు కొత్త రంగులు వేశారంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇది సాధారణ రైలు కంటే ఎక్కువ వేగం కలిగి లేదన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. జనవరి 3న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రెండు కోచ్ లపై రాళ్లు రువ్వడంతో రెండు కిటికీలు దెబ్బతిన్నాయని తెలిపారు.
సాధారణ రైలును కొంచెం మాడిఫై చేశారని ఆ తర్వాత దానికి రంగులు వేసి కొత్తదాని లాగా మార్చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధారణ రైలు పేరు నే వందే రైలుగా కేంద్రం మార్చేసిందన్నారు. విచిత్రం ఏమింటే ఎక్స్ ప్రెస్ , హై స్పీడ్ రైలు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు ఉదయన్ గుహా(Udayan Guha).
ఇదంతా ఒక రకంగా ప్రజల డబ్బులను తగలేశారంటూ మండిపడ్డారు మంత్రి. ఒకవేళ హై స్పీడ్ రైలు అయితే హౌరా నుండి న్యూ జల్పాయిగురికి ఎనిమిది గంటలు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు.
Also Read : అయోధ్యకు రాహుల్ ను పిలుస్తాం