Nisith Pramanik : అరెస్టుకు ఆదేశం కేంద్ర మంత్రి ధిక్కారం
చోరీ కేసులో నిశిత్ ప్రామాణిక్ చేతివాటం
Nisith Pramanik : తాము అత్యంత నీతి వంతమైన పాలన అందిస్తున్నామని పదే పదే చెబుతూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో పలువురిపై కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒకరేమో ఏకంగా రైతులపై ఉసిగొల్పిన చరిత్ర. మరొకరేమో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు.
తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న నిశిత్ ప్రామాణిక్(Nisith Pramanik). ఆయనను అరెస్ట్ చేయాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచిత్రం ఏమిటంటే దొంగలు, దోపిడిదారులను పట్టుకునే హోం శాఖకు బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం.
గతంలో నగలు చోరీ చేసిన కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్నారు నిశిత్ ప్రామాణిక్(Nisith Pramanik). ఈ దొంగతనం ఇప్పుడు కాదు చేసింది. మనోడు 13 ఏళ్ల కిందట ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. సుదీర్ఘ కాలం తర్వాత విచారణ చేపట్టిన కోర్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని దోషిగా తేల్చింది.
వెంటనే అతడిని అరెస్ట్ చేయాలంటూ వారెంట్ జారీ చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని అలీపూర్ దువార్ రైల్వే స్టేషన్ సమీపంలోని గోల్డ్ షాప్ తో పాటు బీర్ పాడా లోని మరో రెండు బంగారు దుకాణాల్లో చోరీ చోటు చేసుకుంది.
ఈ దొంగతనం 2009లో జరిగింది. నవంబర్ 11న సమన్లు జారీ చేసినా కేంద్ర మంత్రి స్పందించ లేదు. దీంతో వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ప్రామాణిక్ ను అరెస్ట్ చేయండి. డిసెంబర్ 7న కోర్టు ముందు హాజరు పర్చాలని స్పష్టం చేసింది.
Also Read : బెంగాల్ గవర్నర్ గా సీవీ ఆనంద బోస్