Devendra Fadnavis : షిండేను బెదిరించిన వ్యక్తి అరెస్ట్
డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
Devendra Fadnavis : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక ప్రకటన చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండేను బెదిరించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై వచ్చిన బెదిరింపులన్నింటిని తన నేతృత్వంలోని మహారాష్ట్ర హోం శాఖ గుర్తించిందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
ఈ మధ్య బెదిరింపులు ఎక్కువ కావడంతో సీఎం ఏక్ నాథ్ షిండేకు అదనపు భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎంకు ప్రాణహాని ఉందన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) సోమవారం మీడియాతో మాట్లాడారు.
సీఎంకు వచ్చిన బెదిరింపులను అన్నింటిని తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి భద్రత , ఇతర అంశాలపై పూర్తి శ్రద్ధ వహిస్తున్నామని ఇప్పటికే బెదిరింపులకు గురి చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్.
కాగా డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తికి సంబంధించి వివరాలు బయటకు చెప్పడం మంచిది కాదని పేర్కొన్నారు. దీనిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఎందుకు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు డిప్యూటీ సీఎం.
సీఎం షిండేను హోటల్ లో చంపేందుకు ప్లాట్ అని పేర్కొంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసిన వ్యక్తిపై పూణే పోలీసులు నాన్ కాగ్నిసబుల్ కింద కేసు నమోదు చేశారు.
అయితే అవినాష్ వాఘ్ మారే అనే వ్యక్తి మద్యం తాగి వాటర్ బాటిల్ కు ఎక్కువ ఛార్జి వసూలు చేశాడని ఆరోపిస్తూ ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : అమిత్ షా టూర్ పై ఉత్కంఠ