Trainee Aircraft Crashed : కూలిన ట్రైనీ విమానం పైల‌ట్ సేఫ్‌

మహారాష్ట్ర పూణె జిల్లాలోని ఇందాపూర్

Trainee Aircraft Crashed :  అదృష్టం ఒక్కోసారి చెప్పి రాదు. ల‌క్ ఉంటే ఏదైనా జ‌ర‌గొచ్చు అనే దానికి ఇది ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. సోమ‌వారం ట్రైనీ విమానం కుప్ప కూలిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది.

విచిత్రం ఏమిటంటే ఫ్లైట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. కానీ అనుకోని రీతిలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అందులో ఉన్న ట్రైనీ పైల‌ట్ బ‌య‌ట ప‌డింది. ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

పూణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకా క‌డ్బ‌న్ వాడి గ్రామంలో ఈ ఘ‌ట‌న జూలై 25 ఉద‌యం 11.30 గంట‌ల‌కు ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో విమానం కూలి పోవ‌డంతో(Trainee Aircraft Crashed)  ఒక్క‌సారిగా గ్రామ‌స్థులు భ‌యాందోళ‌న‌కు లోన‌య్యారు.

ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని, త‌మ‌ను దాడి చేయ‌బోతోందంటూ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. దీంతో ఒక్క‌సారిగా కూలి పోయిన విమానం గ్రామానికి స‌మీపంలోని పంట పొలాల్లో నిలిచి పోయింది.

ట్రైనీ విమానం ముందు భాగం , ఇంజ‌న్ పూర్తిగా ధ్వంస‌మైంది. దీంతో తీవ్ర గాయాల పాలైన ట్రైనీ పైలట్ ను గ్రామ‌స్థులు ధైర్యంతో బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు.

ట్రైనీ లేడీ పైల‌ట్ కావ‌డంతో గ్రామ వాసులు స‌ప‌ర్య‌లు చేశారు. ట్రైనీ విమానం కూలిన ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది.

స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ విష‌యాన్ని జాతీయ మ‌డియా సంస్థ ఏఎన్ఐ ఇవాళ తెలిసింది.

Also Read : మిచిగాన్ యూనివ‌ర్శిటీలో క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!