Punjab VC Row : వీసీ వ్యవహారం సీఎం విచారం
పంజాబ్ ను కుదిపేసిన మంత్రి నిర్వాకం
Punjab VC Row : పంజాబ్ లో కొలువు తీరిన ఆప్ సర్కార్ కు తమ వారి నుంచే తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అవినీతికి సంబంధించి సీఎం తన కేబినెట్ లో మంత్రిని తొలగించారు.
కొంత మంది ఉన్నతాధికారుల తీరు నచ్చక అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారు. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (బీఎఫ్‌యుహెచ్ఎస్) వైస్ ఛాన్సలర్ పై నిప్పులు చెరిగారు.
తనిఖీ చేసిన సమయంలో పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ జౌర మజ్రా ఫైర్ అయ్యారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వీసీ రాజ్ బహదూర్ పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని సీఎం భగవంత్ మాన్ కు తెలియ చేసినట్లు చెప్పాడు. పని వాతావరణం అనుకూలంగా లేనందు వల్ల తాను సేవల నుండి వైదొలుగుతున్నట్లు తెలిపాడు.
ఈ మేరకు వెంటనే తనను రిలీవ్ చేయాలని అభ్యర్థించాడు. నేను నా వేదనను సీఎంకు విన్నవించా. ఒక రకంగా ఇది అవమానకరంగా భావించానని రాజ్ బహదూర్ వాపోయాడు.
ఈ వ్యవహారంపై భగవంత్ మాన్ స్పందించారు. వీసీ పనిమంతుడని కితాబు ఇచ్చారు. మరో వైపు వీసికి(Punjab VC Row) జరిగిన అవమానంపై ప్రతిపక్ష పార్టీలు, వివిధ వైద్యుల సంఘాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆరోగ్య మంత్రి నిర్వాకంపై మండిపడ్డాయి.
అంతకు ముందు రోజు డాక్టర్ రాజ్ బహదూర్ మొహాలీలో మీడియాతో మాట్లాడారు. తమ మంత్రి తన పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర
విచారం వ్యక్తం చేశారని చెప్పారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీసీ కంటతడి పెట్టారు. పదవిలో కొనసాగాలని కోరినట్లు సమాచారం.
Also Read : బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ బట్ట బయలు