PM Modi Agniveers : దేశ రక్షణలో అగ్నీ వీర్ ల పాత్ర కీలకం
ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ
PM Modi Agniveers : దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణలో పని చేసేందుకు కాంట్రాక్టు పద్దతిన అగ్ని వీర్ లను(PM Modi Agniveers) ఎంపిక చేసింది. ఇప్పటికే వేలాది మంది శిక్షణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అగ్ని వీర్ తొలి బ్యాచ్ ను ఉద్దేశించి సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ పొందుతున్న అగ్నివీర్లతో ముచ్చటించారు. మొదటి మ్యాచ్ లో ఎంపికైన వారికి పలు విభాగాలలో కేటాయించారు. వీరికి ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణ పొందిన అనంతరం భారత సైన్యంలోకి తీసుకోనున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ , నేవీ శిక్షణ శిబిరాలలో కేటాయించనున్నారు. అగ్నివీర్లను గోవా, హైదరాబాద్ , మద్రాస్ , పుణె, మధ్య ప్రదేశ్ లోని సాగర్, హిమాచల్ ప్రదేశ్ లోని సుబాతులో శిక్షణకు సిద్దం అవుతున్నారు అగ్నీవీర్ లు.
ఇదిలా ఉండగా నాసిక్ లోని ఆర్టిలరీ సెంటర్ లో మొది బ్యాచ్ లో భాగంగా 2,600 మంది అగ్నీ వీర్ లకు శిక్షణ ప్రారంభమైంది. జనవరి 1వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమైందని సీనియర్ ఆర్మీ ఆఫీసర్ వెల్లడించారు. ఆర్టిలరీ ట్రైనింగ్ సెంటర్ లో అన్ని శిక్షణలకు అవసరమయ్యే సదుపాయలను ఒకే చోట అందుబాటులో ఉంచారు.
ఇక్కడ శిక్షణ తీసుకున్న అగ్నీ వీరులకు ఇండియన్ ఆర్మీలో డ్రైవర్లుగా, ఆపరేటర్లుగా , సాంకేతిక సాహాయకులుగా నియమించనున్నారు. ఈ సందర్భంగా మోదీ అగ్నీ వీర్ లు దేశ సేవలో నిమగ్నం అయ్యేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు.
Also Read : కరోనా చికిత్సకు పేటెంట్ మినహాయింపు