S Jai Shankar : శాంతి పరిరక్షకుల పాత్ర ప్రశంసనీయం
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ఎస్ జై శంకర్
S Jai Shankar : ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో భారత దేశానికి చెందిన శాంతి పరిరక్షకులు నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. అధికారికంగా మొదటిసారి సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి. యుఎన్ జెండా కింద సేవలు అందించడం గర్వంగా ఉందన్నారు జై శంకర్(S Jai Shankar).
సైప్రస్ లోని జనరల్ కేఎస్ తిమయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వీధిని సందర్శించారు. ఈ దేశం 60 ఏళ్ల దౌత్య సంబంధాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి. జనరల్ కేఎస్ తిమ్మయ్య పేరు మీద లార్నాకా లోని వీధిని చూడటం ఆనందంగా ఉందన్నారు.
భారత శాంతి పరిరక్షకులు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం దేశానికి , తనకు సంతోషం కలిగిస్తోందన్నారు ఎస్ జై శంకర్. ఇదిలా ఉండగా సైప్రస్ లోని ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పాల్గొన్నందుకు సైప్రస్ విదేశాంగ శాఖ మంత్రి ఐయోనిస్ కసౌలిడెస్ భారత దేశం గణనీయమైన సహకారాన్ని ప్రశంసిచారు.
ఇందుకు సంబంధించి కృతజ్ఞతలు తెలిపారు. ఐక్య రాజ్య సమితికి సంబంధించి అత్యధిక సైనికులను అందించిన రెండో దేశం భారత దేశం. మన దేశానికి చెందిన సైనికులు 5,887 మంది పని చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సైప్రస్ మంత్రితో భేటీ అయ్యారు.
సైప్రస్ లో యుఎన్ శాంతి పరిరక్షక కమిషన్ ముగ్గురు భారతీయ కమాండర్ లను కలిగి ఉంది. జనరల్ గ్యాని, జనరల్ తిమ్మయ్య, జనరల్ దీవాన్ ప్రేమ్ చంద్ పని చేశారు.
Also Read : సౌదీ ఫుట్ బాల్ క్లబ్ తో రొనాల్డో బిగ్ డీల్