Jyotiraditya Scindia : రాజీ పడం ప్రయాణికుల భద్రత ముఖ్యం
స్పష్టం చేసిన జ్యోతిరాదిత్యా సింధియా
Jyotiraditya Scindia : ఇటీవల విమానాలలో ప్రయాణం చేస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజీసీఏ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ప్రయాణికుల జర్నీతో పాటు వారి క్షేమం కూడా ప్రభుత్వంపై బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ తరుణంలో ఇటీవల తరుచూగా ఆయా ఎయిర్ లైన్స్ లకు సంబంధించిన ఫ్లైట్స్ లలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత 30 రోజులలో వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ తరుణంలో కేంద్ర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా(Jyotiraditya Scindia) సంచలన కామెంట్స్ చేశారు. ఆదాయం కంటే ముందు ప్రయాణికుల భద్రత ముఖ్యమని స్పష్టం చేశారు. ఇందులో ఎక్కడా రాజీ పడడం అంటూ ఉండదన్నారు.
శుక్రవారం జ్యోతిరాదిత్యా సింధియా మీడియాతో మాట్లాడారు. దేశీయ క్యారియర్లకు సంబంధించిన భద్రతా, సంబంధిత సంఘటనలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు.
వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూస్తామన్నారు కేంద్ర మంత్రి. గతకొన్ని వారాలు, నెలల్లో నిర్ణయాత్మక చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనేక స్పాట్ చెక్ లు, రెగ్యులేటరీ ఆడిట్ లను సైతం నిర్వహించిందని వెల్లడించారు.
ఈ మేరకు తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగిందన్నారు జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia). ఇదిలా ఉండగా అస్సాంలోని జోర్హాట్ నుండి కోల్ కతాకు బయలు దేరిన ఇండిగో విమానం గురువారం టేకాఫ్ సమయంలో రన్ వే నుండి జారి పోయింది.
దాని చక్రాల జత బురదలో కూరుకు పోయింది.
Also Read : గ్లోబల్ సింగర్ షకీరాకు బిగ్ షాక్