Omar Abdullah : సెక్యూరిటీ లోపం నిజం – ఒమర్ అబ్దుల్లా
రాహుల్ భారత్ జోడో యాత్ర నిలిపి వేత
Omar Abdullah : కాంగ్రెస్ అగ్ర నాయకుడు చేపట్టిన భారత్ జోడో యాత్ర సెక్యూరిటీ వైఫల్యం కారణంగా అర్ధాంతరంగా నిలిచి పోయింది. కాశ్మీర్ లోని బనిహాల్ కు చేరుకుంది. ఈ సందర్భంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా యాత్రలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. రాష్ట్ర పరిపాలన ద్వారా భద్రతను కావాలని ఉల్లంఘించారంటూ ఆరోపించారు మాజీ సీఎం. జన సమూహాన్ని తప్పుగా నిర్వహించారని కాంగ్రెస్ మండిపడింది. ఖాజీ గుండ్ సమీపంలో మార్చ్ నిలిపి వేసింది. దీనికి నేను సాక్షిని, రాహుల్ గాంధీ నడవడం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్వహించే కార్టన్ వెలుపలి నుంచి వెళ్లి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) .
ఈ విషయాన్ని మాజీ సీఎం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 11 మీటర్ల నడక కోసం ఎదురు చూశాం. కానీ దురదృష్టవశాత్తు దానిని రద్దు చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ పోలసులు నిర్వహించాల్సిన ఔటర్ కార్బన్ అదృశ్యమైనట్లు కనుగొన్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
500 మీటర్లు నడిచిన తర్వాత భారత్ జోడో యాత్రను నిలిపి వేయాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర 3,600 కిలోమీటర్లకు పైగా చేరుకుంది. జనవరి 30 వరకు పూర్తవుతుంది. ఈనెల 31న కాశ్మీర్ లో బహిరంగ సభ తో పూర్తవుతుంది. ప్రస్తుతం సెక్యూరిటీ లోపంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Also Read : భద్రతా వైఫల్యం రాహుల్ ఆగ్రహం