PM Modi : అభివృద్ది నినాదం అదే మా లక్ష్యం – మోదీ
షిల్లాంగ్ లో రెడ్ కార్డ్ చూపించిన ప్రధాని
PM Modi : అభివృద్ది నినాదం అదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). అవినీతి, వివక్ష, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మూలించేందుకు మేఘాలయలో ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని చెప్పారు. ఆదివారం షిల్లాంగ్ లో జరిగిన ఈశాన్య మండలి (ఎన్ఇసీ) స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో ప్రధాన అవరోధంగా ఉన్న అవినీతి, పక్షపాతం, బంధు ప్రీతి, హింస, ప్రాజెక్టుల స్తంభన, ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టామన్నారు.
ప్రస్తుతం ఒక్కటే అది అభివృద్ది నినాదం మాత్రమే మిగిలి ఉందన్నారు. తాము అభివృద్ది కోసం ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు ప్రధానమంత్రి(PM Modi). అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఫుట్ బాల్ ఫీవర్ మనందరినీ ప్రస్తుతం పట్టి పీడిస్తోందని దాని పదజాలం ఎందుకు ఉపయోగించ కూడదన్నారు మోదీ. ఎవరైనా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వెళితే వారికి రెడ్ కార్డ్ చూపిస్తారని గుర్తు చేశారు. చాలా మందికి రెడ్ కార్డ్ చూపించామని అన్నారు.
ఖతార్ లో మీరు ఫుట్ బాల్ ఆటను ఆస్వాదిస్తున్నారు. అలాంటి సాకర్ సంబురం భారత్ లో కూడా త్వరలో రానుందన్నారు. ఇక్కడ యువత కూడా శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని ఆ రోజు త్వరలోనే వస్తుందన్నారు ప్రధానమంత్రి.
Also Read : సరిహద్దు వివాదం మోదీ మౌనం – రౌత్