సనాతన మార్గం దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్న మాట ఏమో కానీ భక్తులు మాత్రం తండోప తండాలుగా తరలి వస్తున్నారు ముచ్చింతల్ కు.
Statue Of Equality : శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి.
దేశం నలుమూలల నుంచి పండితులు, రుత్వికులు, స్వాములు, పీఠాధిపతులు హాజరయ్యారు. యాగశాల ప్రాంగణం జై శ్రీమన్నారాయణ జపంతో, వేద మంత్రాలతో దద్దరిల్లుతోంది.
భాగ్యనగరానికి ఇదో మకుటాయమానంగా నిలిచి పోతుందనడంలో సందేహం లేదంటున్నారు భక్త బాంధవులు. ఇప్పటికే దేశానికి దిశా నిర్దేశం చేసే పాలకులంతా శ్రీరామనగరంకు విచ్చేయడం చిన్న జీయర్ స్వామి వారికి సాగిల పడటం మామూలై పోయింది.
రూ. 1000 కోట్లతో 216 అడుగుల శ్రీ రామానుజుడి సమతా మూర్తి విగ్రహాన్ని(Statue Of Equality )చూసి తరించి పోతున్నారు భక్తులు. దేశంలోనే అతి పెద్ద విగ్రహంగా పేర్కొంటున్నారు.
దీనికంటే పెద్దది బ్యాంకాక్ లో బుద్దుడి విగ్రహాన్ని 316 అడుగులతో ఏర్పాటు చేశారు. ఎందుకు ఇంత భారీ ఎత్తున ఖర్చు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్న ప్రశ్న ఉదయిస్తోంది.
ఇందుకు సంబంధించి ఆశ్రమాన్నిఏపీ సీఎం జగన్ రెడ్డి సందర్శించిన సమయంలో జవాబు ఇచ్చే ప్రయత్నం చేశారు చిన్నజీయర్ స్వామి.
వెయ్యేళ్ల కిందట ఈ భువిపై జన్మించిన రామానుజుడు బోధించిన సమానత సందేశం (Statue Of Equality ) రాబోయే తరాలకు స్పూర్తిగా ఉండాలంటే ఈ భారీ విగ్రహం అవసరమని పేర్కొన్నారు.
భక్త బాంధవులు రామానుజుడు చూపిన మార్గాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలని బోధిస్తున్నారు చిన్న జీయర్.
Also Read : యాదాద్రి పనుల పురోగతిపై సీఎం ఆరా