Math Teacher Tied : టీచ‌ర్ ను చెట్టుకు క‌ట్టేసిన స్టూడెంట్స్

మార్కులు త‌క్కువ వేశాడ‌ని ఆగ్ర‌హం

Math Teacher Tied :  పాఠాలు బోధించే పంతులును చెట్టుకు క‌ట్టేసిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ సంఘ‌ట‌న జార్ఖండ్ లో చోటు చేసుకుంది.

గ‌ణిత పాఠాలు బోదించే టీచ‌ర్ కు షాక్ ఇచ్చారు. ఏకంగా చెట్టుకు క‌ట్టేశారు. టీచ‌ర్ తో పాటు క్ల‌ర్క్ ను కూడా క‌ట్టేశారు. జార్ఖండ్ అక‌డ‌మిక్ కౌన్సిల్ (జేఏసీ) 9వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల చేసింది.

గ‌ణితం స‌బ్జెక్టులో 32 మందిలో 11 మంది విద్యార్థులు ఫెయిల్ కు స‌మాన‌మైన గ్రేడ్ డిడి (డ‌బుల్ డి) పొందారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు విద్యార్థులు.

జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలోని రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లో ప‌ని చేస్తున్న గ‌ణిత టీచ‌ర్, గుమాస్తాలు 9వ త‌ర‌గ‌తిలో పేల‌వ‌మైన మార్కులు వ‌చ్చాయంటూ నివేదించారు.

దీంతో త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌న్న కోపంతో విద్యార్థులంతా ఒక్క‌సారిగా టీచ‌ర్, క్ల‌ర్క్ ల‌ను చెట్టుకు (Math Teacher Tied) కట్టేశారు. ఆపై వారంతా క‌లిసి దాడికి పాల్ప‌డ్డారు.

జిల్లాలోని గోపికంద‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ప్ర‌భుత్వ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇదిలా ఉండ‌గా ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పాఠ‌శాల యాజ‌మాన్యం ఎటువంటి రాత పూర్వ‌కంగా ఫిర్యాదు ఇవ్వ‌లేదు.

అందుకే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు ఒప్పుకోలేద‌ని పేర్కొన్నారు.

ఎందుకంటే ఫిర్యాదు చేస్తే పిల్ల‌ల భ‌విష్య‌త్తు దెబ్బ తింటుంద‌ని బాధ‌తో అలా చేసి ఉంటార‌ని ఊరుకున్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

Also Read : హార్దిక్ పాండ్యాను ప‌క్క‌న పెట్టేశారు

Leave A Reply

Your Email Id will not be published!