MK Stalin Jallikattu : సుప్రీం నిర్ణ‌యం చ‌రిత్రాత్మ‌కం

జ‌ల్లి క‌ట్టు తీర్పుపై ఎంకే స్టాలిన్

MK Stalin Jallikattu : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించారు జ‌ల్లి క‌ట్టు పై. ఇది పూర్తిగా ప్ర‌జ‌ల‌కు, సాంస్కృతిక వార‌సత్వానికి సంబంధించిన‌ద‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం. క్రీడ‌ల‌ను అనుమ‌తించే త‌మిళ‌నాడు చ‌ట్టాన్ని అత్యున్న‌త న్యాయ స్థానం స‌మ‌ర్థించ‌డాన్ని ప్ర‌శంసించారు ఎంకే స్టాలిన్. చ‌రిత్ర‌లో ఇది స్థిర స్థాయిగా నిలిచి పోయే రోజుగా అభివ‌ర్ణించారు.

ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడుతో పాటు మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల‌లో జ‌రిగే క్రీడ‌ల‌కు కూడా ప‌చ్చ జెండా ఊపింది. ఇక జ‌ల్లి క‌ట్టును కంటిన్యూ చేయ‌డాన్నిస‌వాల్ చేస్తూ పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. దీనిపై విచారించింది కోర్టు. ఐదుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం జ‌ల్లిక‌ట్టుపై ఏక‌గ్రీవ తీర్పును వెలువ‌రించింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఎంకే స్టాలిన్.

ఇది రాష్ట్ర చ‌రిత్ర‌లో బంగారంతో చెక్క‌ద‌గిన తీర్పుగా ఆయ‌న పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 2024 పొంగ‌ల్ (సంక్రాంతి) సీజ‌న్ లో విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని జ‌రుపుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం. న్యాయ స్థానంలో జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తుగా ప్ర‌భుత్వం వాద‌న‌లు చేసింద‌ని , దాని వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు ఎంకే స్టాలిన్. త‌మిళుల ధైర్య సాహ‌సాఆలు, సంస్కృతికి అద్దం ప‌ట్టే క్రీడ జ‌ల్లి క‌ట్టుపై నిషేధం లేద‌ని సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

Also Read : Chandrababu Naidu

Leave A Reply

Your Email Id will not be published!