Sonia Rahul Gandhi : సోనియా..రాహుల్ కు కోలుకోలేని షాక్
నేషనల్ హెరాల్డ్ కేసులో అరెస్ట్ తప్పదా
Sonia Rahul Gandhi : త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. ఈ మేరకు మోదీ త్రయం (మోదీ..అమిత్ షా..జేపీ నడ్డా ) పావులు కదుపుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ..ఒకే మతం..ఒకే జాతి..ఒకే భాష ఉండాలన్ని ఆ పార్టీ లక్ష్యం. ఆ దిశగా ఇప్పటి వరకు కొలువు తీరిన మోదీ ప్రభుత్వం మెల మెల్లగా తనకు ఎదురే లేకుండా చేసుకుంటూ వస్తోంది.
9 ప్రభుత్వాలను కూల దోసింది. ఇక ప్రధానంగా వాయిస్ పెంచుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టింది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi), మాజీ చీఫ్ రాహుల్ గాంధీలకు షాక్ ఇచ్చింది.
నేషనల్ హెరాల్డ్ కేసు తిరగదోడింది. చివరకు ఈడీ ఆఫీసు మెట్లు ఎక్కే పరిస్థితిని తీసుకు వచ్చింది. మరాఠాలో వాయిస్ లేకుండా చేసింది. బెంగాల్ బెబ్బులిగా పేరొందిన మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తోంది.
ఇక నిన్నటి దాకా కారాలు మిరియాలు నూరిని కేసీఆర్ ను కాళ్ల బేరానికి తీసుకు వచ్చేలా చేసింది. ఇక కేంద్రంపై ప్రగల్బాలు పలికిన ఏపీ సీఎంను పిల్లిలాగా మార్చేసింది.
ఇక మిగతా ఒకటి రెండు రాష్ట్రాలలో నిద్ర లేకుండా చేస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, సోదాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి బహుషా తమిళనాడు మాత్రమే డైరెక్టుగా ఫైట్ చేసే చాన్స్ కనిపిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను విస్తృతం చేయకుండా తమలో తామే మధన పడేలా ప్లాన్ చేసింది బీజేపీ.
ఆ వ్యూహం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సోనియా, రాహుల్ మెడకు చుట్టుకునేలా చేసింది నేషనల్ హెరాల్డ్ కేసు. చివరకు వారిని కూడా జైలుకు పంపిస్తుందా అన్న అనుమానం కలుగుతోంది.
Also Read : కేంద్రం నిర్వాకం కాంగ్రెస్ ఆగ్రహం