Anil Vij Accident : మంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు
మంత్రి అనిల్ విజ్ సురక్షితం
Anil Vij Accident : హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రమాదానికి గురయ్యారు. గత మూడు వారాల్లో మంత్రి రెండోసారి ప్రమాదానికి గురి కావడం విస్తు పోయేలా చేసింది. ఢిల్లీ సమీపంలోని కేఎంపీ ఎక్స్ ప్రెస్ వేపై వెనుక నుండి అతడి కారును(Anil Vij Accident) ట్రక్కు ఢీకొట్టింది. ఇదే సమయంలో ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టడంతో భారతీయ జనతా పార్టీకి చెందిన అనిల్ విజ్ గాయపడ్డారు.
చండీగఢ్ లోని కుండ్లీ – మనేసర్ – పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ ప్రెస్ వేపై ట్రక్కు అతడి రక్షణగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ విజ్ సురక్షితంగా బయటపడ్డారు. కాగా అధికారిక కారుకు ప్రమాదం కావడం విస్తు పోయేలా చేసింది. గత ఏడాది 2022 డిసెంబర్ 19న అంకు ముందు మంత్రి కారు చెడి పోయిన ప్రదేశానికి సమీపంలోనే బహదూర్ ఘర్ పట్టణానికి సమీపంలో తాజా సంఘటన జరిగింది.
అనిల్ విజ్ రెండు సందర్భాల్లోనూ తన సొంత నియోజకవర్గమైన అంబాలా కాంట్ నుండి గురుగ్రామ్ కు వెళుతున్నాడు. ఇదిలా ఉండగా డిసెంబర్ సంఘటన తర్వాత అనిల్ విజ్ కొత్త అధికారిక వాహనం పొందారు. ప్రభుత్వం మంత్రికి ప్రత్యేకంగా వోల్వో కారును ఏర్పాటు చేసింది. తాను కేఎంపీ ఎక్స్ ప్రెస్ వేపై ఆగి ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అనిల్ విజ్ చెప్పారు.
ఇవాళ జరిగిన సంఘటన మునుపటి సంఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరగా ఉంది. నేను నా కారులో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా నా కారు వెనుక 10 అడుగుల దూరంలో ఉన్న నా ఎస్కార్ట్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టిందన్నారు అనిల్ విజ్.
Also Read : బీహార్ లో జనాభా సర్వే స్టార్ట్ – సీఎం