Uddhav Thackeray : అంతిమ విజ‌యం మాదే – ఉద్ద‌వ్ ఠాక్రే

శివ‌సేన పార్టీ ఎవ‌రిద‌నే దానిపై కామెంట్

Uddhav Thackeray : దేశంలో శివ‌సేన పార్టీ ఓ సంచ‌ల‌నం. కొన్నేళ్ల కింద‌ట దీనిని బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించారు. ఆయ‌న‌ను మ‌హారాష్ట్ర‌లో మ‌రాఠా యోధుడిగా ఇప్ప‌టికీ కొలుస్తారు. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు ల‌క్ష‌లాది మంది త‌ర‌లి వ‌చ్చారు. ఇది ఓ రికార్డుగా మిగిలి పోయింది. అది గ‌త చ‌రిత్ర‌. ప్ర‌స్తుతం శివ‌సేన పార్టీ ఎవ‌రిది అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఎందుకంటే ఈ పంచాయ‌తీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కీల‌క‌మైన తీర్పు ఎవ‌రి ప‌క్షాన ఉంటుందనే దానిపై ఎవ‌రికి వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. శివ‌సేన పార్టీపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో క‌లిసి ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తుతో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. తానే సీఎం పీఠంపై కూర్చున్నారు. దీంతో వివాదం మ‌రింత ముదిరింది. ఎవ‌రిది అస‌లైన పార్టీ అనే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. త‌న తండ్రి బాలా సాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివ‌సేన త‌మ‌దేన‌ని వేరెవ్వ‌రికీ అధికారం లేదంటూ ప్ర‌క‌టించారు మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray).

మ‌రో వైపు ఎమ్మెల్యేల , ఎంపీల ప్రాతినిధ్యం త‌మ వైపు ఉంద‌ని కావున త‌మ‌దే అస‌లైన శివ‌సేన అంటూ స్ప‌ష్టం చేశారు సీఎం ఏక్ నాథ్ షిండే. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే.

ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ప్ర‌గ‌ల్భాలు ప‌లికినా అంతిమ విజ‌యం త‌మ‌దేన‌ని ప్ర‌క‌టించారు. కుట్ర‌లు, కుతంత్రాలు, వెన్నుపోట్ల‌కు పాల్పడిన వారికి త‌మ తండ్రిని ఉచ్చ‌రించే నైతిక హ‌క్కు లేద‌న్నారు ఉద్ద‌వ్ ఠాక్రే.

Also Read : మేడం చేతిలో రాజ‌స్థాన్ భ‌విత‌వ్యం

 

Leave A Reply

Your Email Id will not be published!