Sirajuddin Haqqani : యావత్ ప్రపంచం వెతుకుతున్న సిరాజుద్దీన్ హక్కానీ ఫోటోను విడుదల చేశారు తాలిబన్లు. పాకిస్తాన్ ఉత్తర వజీరిస్థాన్ లో ఉన్న అల్ ఖైదా తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ మాఫియా అయిన హక్కానీ నెట్ వర్క్ కు సిరాజుద్దీన్ హక్కాని(Sirajuddin Haqqani) చీఫ్ గా ఉన్నాడు.
2007లో యూఎన్ అతడిని ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించింది. అమెరికా అతడిపై 10 మిలియన్ల బహుమతిని ప్రకటించింది. ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ లోని పోలిస్ అకాడెమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో తాలిబన్ తాత్కాలిక అంతర్గత మంత్రిగా ఉన్న సిరాజుద్దీన్ హక్కానీ(Sirajuddin Haqqani) ప్రత్యక్షమయ్యారు.
వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు హక్కానీ. ఆఫ్గనిస్తాన్ సర్కార్ మొదటి సారిగా హక్కానీ ఫోటో విడుదల చేయడంతో అమెరికా ఒక్కసారిగా ఉలికి పడింది.
ఇంత వరకు ఎక్కడున్నాడో లేడోనన్న ఉత్కంఠకు తెరదించారు తాలిబన్లు. ఇస్లామిక్ ఎమిరేట్ అంతర్గత మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ హఫీజుల్లా నేషనల్ పోలీస్ గ్రాడ్యుయేషన్ వేడుకను ప్రారంభించారంటూ ఆఫ్గాన్ సర్కార్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
15 ఏళ్ల పాటు హక్కానీని వెంబడించింది అమెరికా. ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసింది. 2021లో ఏర్పాటైన తాలిబన్ ప్రభుత్వంలో ఆయన కూడా ఉన్నారు.
కానీ ఎక్కువగా కనిపించకుండా పోయారు. చట్ట బద్దత కోరే ప్రయత్నంలో భాగంగానే హక్కానీ బయటకు వచ్చాడని అంటున్నారు. 2018లో మరణించినట్లు ప్రకటించిన మాజీ ముజాహిద్దీన్ పోరాట యోధుడు జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే ఈ సిరాజుద్దీన్.
2008లో కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన ఉగ్ర దాడిలో 58 మంది మృతి చెందారు. 2009, 2010లో భారతీయులకు వ్యతిరేకంగా జరిగిన దాడులకు అతడే బాధ్యత వహించాడు.
Also Read : మాట తప్పిన పుతిన్ పై మండిపాటు