Chandrika Prasad Santokhi : మోడీ లాంటి లీడర్ కావాలి
ప్రెసిడెంట్ చంద్రికాప్రసాద్ సంతోఖి
Chandrika Prasad Santokhi : సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ సంతోఖి సంచలన కామెంట్స్ చేశారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచానికి మోడీ లాంటి నాయకుడు కావాలని పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో భారత్ అన్న విధాలుగా అభివృద్ది చెందుతోందన్నారు.
ఇండోర్ లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్ కు చంద్రికా ప్రసాద్ సంతోఖి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ వేదికపై భారత్ నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. జీ20 వంటి విస్తృత వేదికపై వివాదాలను పరిష్కరించడంలో , గ్లోబల్ సౌత్ వాయిస్ ను పెంచడంలో భారత్ కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
భారత దేశం వంటి దేశం ప్రపంచానికి అత్యంత అవసరమని స్పష్టం చేశారు చంద్రికా ప్రసాద్ సంతోఖి(Chandrika Prasad Santokhi) . ప్రత్యేకించి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి తమ దేశం సంపూర్ణ మద్దతును భారత్ కు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జీ20కి అధ్యక్షత వహించడం భారత దేశానికి గర్వ కారణమని కొనియాడారు.
ఇదే సమయంలో జీ20 సభ్యులకే కాదు సీటు లేని, వాయిస్ లేని అనేక ఇతర దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో మోదీ చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను భారత్ అత్యంత చాకచక్యంగా పరిష్కరించేలా చేసిందన్నారు. మరోసారి అతిపెద్ద ప్రజాస్వామ్యమని ప్రపంచానికి చూపించిందన్నారు.
Also Read : ‘సీజేఐ’పై విచారణకు నిరాకరణ