Sachin Pilot Gehlot : అంతా అబ‌ద్దం మ‌ళ్లీ మాదే అధికారం

సీఎం అశోక్ గెహ్లాట్ తో విభేదాలు లేవు

Sachin Pilot Gehlot : రాజ‌స్థాన్ లో తాత్కాలిక సంక్షోభానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు యువ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్(Sachin Pilot) . కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర రాజ‌స్థాన్ కు చేరుకుంది. ప్ర‌స్తుతం దేశంలో కేవ‌లం రెండు రాష్ట్రాల‌లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇందులో భాగంగా దేశంలో విద్వేష రాజ‌కీయాలు ఉండ కూడ‌దంటూ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఈ యాత్ర ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రారంభ‌మైంది. ఇది కాశ్మీర్ దాకా సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ముగిసింది. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ లో కొన‌సాగుతోంది. ఇక్క‌డ సీఎం అశోక్ గెహ్లాట్ సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లో కొన‌సాగుతోంది. పాద‌యాత్ర కంటే ముందు సీఎం, స‌చిన్ పైల‌ట్ ల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డిచింది.

ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు మిరియాలు నూరుకున్నారు. తాను ఉన్నంత వ‌ర‌కు రాజ‌స్థాన్ కు స‌చిన్ పైల‌ట్(Sachin Pilot)  సీఎం కాలేడ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం గెహ్లాట్. అంతే కాదు బీజేపీకి చెందిన అమిత్ షా తో క‌లిసి కుట్ర ప‌న్నాడంటూ ఆరోపించారు.

దీంతో ప్ర‌భుత్వం ప‌డి పోతుందేమోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ఈ త‌రుణంలో రాహుల్ గాంధీ ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చారు. ప్ర‌స్తుతం సీఎం గెహ్లాట్ తో పాటు స‌చిన్ పైల‌ట్ క‌లిసి న‌డుస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా స‌చిన్ పైల‌ట్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎంకు నాకు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని క‌లిసే ఉన్నామ‌ని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో తిరిగి తామే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని జోస్యం చెప్పారు.

Also Read : ఓట‌ర్ల‌కు బీజేపీ డ‌బ్బుల‌తో ఎర – డింపుల్

Leave A Reply

Your Email Id will not be published!