Rahul Gandhi : టీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు – రాహుల్
కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం ఎక్కువ
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. భారత్ జోడో యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలలో కొనసాగుతోంది.
ఈ సందర్బంగా సోమవారం శంషాబాద్ లో మీట్ ది ప్రెస్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు.
భారతీయత పేరుతో..హిందూత్వ పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు. కులాలు, ప్రాంతాలు, మతాలు, విద్వేషాల పేరుతో దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందన్నారు.
భారత్ జోడో యాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా కొలువు తీరిన ప్రజలు ఏమనుకుంటున్నారో , వారి ఇబ్బందులు ఏమిటో తాను తెలుసు కోగలిగానని చెప్పారు రాహుల్ గాంధీ. ఈ యాత్రతో తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఈ దేశం గురించి మరింత కూలంకుశంగా తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు.
కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీని పెట్టుకోవడంలో తప్పు లేదన్నారు. ఆయన రాష్ట్రంలోనే కాదు దేశంలో, అంతర్జాతీయంగా కూడా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ సీఎం కేసీఆర్ తో మాట్లాడడంలో తాము తప్పు పట్టడంలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకు తింటున్న టీఆర్ఎస్ ను ఎదుర్కొంటుందని చెప్పారు రాహుల్ గాంధీ.
Also Read : గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్ర