CEC Rajiv Kumar : ఎన్నిక‌ల షెడ్యూల్ పై ప‌క్షపాతం లేదు

స్ప‌ష్టం చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

CEC Rajiv Kumar : కేంద్ర ఎన్నిక‌ల సంఘం కేంద్రానికి మేలు చేకూర్చేందుకే గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఆల‌స్యంగా ప్ర‌క‌టించింద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన రాజ్యాంగ సంస్థ అని పేర్కొంది. ఇందులో ఒక పార్టీకి లేదా కొంద‌రి వ్య‌క్తుల‌కు గులాం గిరీ చేయ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఎప్ప‌టి లాగే తాము అనుకున్న‌ట్టుగానే ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

ఈసీ ఎప్పుడూ నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని పార్టీలు తెలుసుకుంటే మంచింద‌న్నారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రెండు ద‌శ‌ల్లో పోలింగ్ చేప‌డ‌తామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 1, 5 తేదీల‌లో కొన‌సాగుతుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌క పోవ‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్పారు.

అందులో తాజాగా చోటు చేసుకున్న మోర్బీ బ్రిడ్జి కూలి పోవ‌డం కూడా ఒక‌టి అని పేర్కొన్నారు సీఈసీ. రెండు రాష్ట్రాల‌కు సంబంధించిన తేదీల ప్ర‌క‌ట‌న‌లో రెండు వారాల గ్యాప్ ఉన్న‌ప్ప‌టికీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ తో పాటు గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు సంబంధించి డిసెంబ‌ర్ 8న ఓట్ల‌ను లెక్కిస్తామ‌న్నారు రాజీవ్ కుమార్.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిపిన అన్ని ఎన్నిక‌ల‌ను తాము నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించామ‌ని స్ప‌ష్టం చేశారు సీఈసీ రాజీవ్ కుమార్. ప్ర‌ధాని కోస‌మే తాము షెడ్యూల్ లేట్ చేశామంటూ చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌న్నారు.

Also Read : ఆప్ గుజ‌రాత్ సీఎం అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న

Leave A Reply

Your Email Id will not be published!