Arindam Bagchi : వివాదాలకు సైనిక పరిష్కారం లేదు
అరిందమ్ బాగ్చీ సీరియస్ కామెంట్స్
Arindam Bagchi : విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి వివాదానికి సైనిక పరిష్కారం లేదన్నారు. ఆర్మేనియా, అజర్ బైజాన్ ఘర్షణపై స్పందించారు.
భారత్ ద్వైపాక్షిక వివాదాలను దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించు కోవాలని భారత దేశం నమ్ముతుందన్నారు. ఇదిలా ఉండగా ఆర్మేనియా – అజర్ బైజాన్ సరిహద్దులో తాజా పోరాటాల మధ్య భారత దేశం దూకుడు వైపు పరుగులు తీస్తున్న వాటిని తగ్గించు కోవాలని సూచించింది.
తక్షణమే శత్రుత్వాలను విరమించు కోవాలని సూచించారు. సెప్టెంబర్ 12,13 తేదీలలో ఆర్మేనియా – అజర్ బైజాన్ సరహద్దు వెంబడి దాడులకు సంబంధించిన నివేదికలను తాము చూశామని వెల్లడించారు అరిందబ్ బాగ్చీ(Arindam Bagchi).
ఇందులో పౌర నివాసాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. వెంటనే దురాక్రమణకు దిగిన వారు ఉపసంహరించు కోవాలని భారత్ కోరుతోందన్నారు.
దాడులపై వచ్చిన వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నలకు అరిందమ్ బాగ్చీ సమాధానం ఇచ్చారు. ఎటువంటి వివాదాలకు తావు లేదు. పరస్పర ఆమోదకరమైన వాతావరణంలో చర్చలు జరుపు కోవాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
శాంతియుత పరిష్కారానికి చర్చలను కొనసాగించాలని ఆర్మేనియా, అజర్ బైజాన్ లకు సూచించామని స్పష్టం చేశారు. కాగా ఇరు దేశాల మధ్య నాగర్నో – కరాబాఖ్ పర్వత ప్రాంత ఎన్ క్లేవ్ పై తీవ్రమైన సైనిక వివాదం ఉంది.
ఇదిలా ఉండగా నగోర్నో – కరాబాక్ ప్రాంతంపై అజర్ బైజాన్ తో జరిగిన ఘర్షణల్లో దాదాపు 50 మందికి పైగా సైనికులు మరణించారని ఆర్మీనియా ఆరోపించింది.
Also Read : చైనాకు ధీటుగా భారత్ – సీతారామన్