Siddharamaiah : గుజరాత్ ప్రభుత్వం ఆరు నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుతున్నట్లు ప్రకటించింది. దీనిని తాము స్వాగతిస్తున్నట్లు కర్ణాటక విద్యా శాఖ మంత్రి నగేశ్ తెలిపారు.
దీనిని కంటిన్యూ చేస్తూ ఇదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి సైతం దేశ వ్యాప్తంగా ఇది అమలు చేసేలా రాష్ట్రాలు ఆలోచించాలని కోరారు.
ఈ తరుణంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య (Siddharamaiah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థల్లో భగవద్గీత బోధించేందుకు తమకు , పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని కుండ బద్దలు కొట్టారు.
వారు భగవద్గీత, బైబిల్, ఖురాన్ దేనిని బోధించినా తాము అడ్డ చెప్పబోమన్నారు. పిల్లలకు కావాల్సింది మెరుగైన విద్యతో పాటు విలువలు కూడా ఉండాలన్నారు. ఇలాంటి విద్యనే తాము కోరుకుంటామని చెప్పారు.
అయితే ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడేలా విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థపై, ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు సిద్దరామయ్య.
తమ ఇంట్లోనే కాదు దేశంలోని ఏ ఇళ్లల్లోనైనా పెద్దలు భగవద్గీత, రామాయణం, మహాభారతం నేర్పించేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పారు.
మంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఆయన మీడియాతో మట్లాడారు. అయితే భారత రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించేలా చర్యలు ఉండ కూడదన్నారు.
తాము రాజ్యాంగంతో పాటు సెక్యూలరిజాన్ని గుర్తిస్తామని, గౌరవిస్తామని అన్నారు మాజీ సీఎం. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం ఇంకా భగవద్గీతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
Also Read : సారు ప్రకటన నిరుద్యోగుల ఆవేదన