JP Nadda : ప్ర‌జాస్వామ్యంలో రాహుల్ కు స్థానం లేదు

భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా కామెంట్స్

JP Nadda Rahul Gandhi : భార‌తీయ జ‌న‌తా ఆప‌ర్టీ చీఫ్ చీఫ్ జేపీ న‌డ్డా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌జాస్వామ్యంపై రాహుల్ గాంధీకి ఏ మాత్రం న‌మ్మ‌కం లేద‌న్నారు. అలాంటి వ్య‌క్తికి ఇక్క‌డ ఉండే అర్హ‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు జేపీ న‌డ్డా(JP Nadda Rahul Gandhi). పూర్తిగా దేశం ప‌ట్ల గౌర‌వం లేకుండా మాట్లాడుతూ ప‌రువు పోగొట్టేలా చేస్తున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. రాహుల్ గాంధీ ప్ర‌జా స్వామ్యం లోని అన్ని హ‌ద్దుల‌ను దాటారంటూ ఆరోపించారు. డెమోక్ర‌సీ ప‌ద్ద‌తిలో లాక్ , స్టాక్ , బ్యారెల్ ప్యాకింగ్ కు పంపాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జాస్వామ్యం పై న‌మ్మ‌కం లేని వారికి ఇక్క‌డ స్థానం ఎందుకు ఉండాల‌ని జేపీ న‌డ్డా ప్ర‌శ్నించారు.

త‌మిళ‌నాడులోని చెన్నైలో జ‌రుగుతున్న బీజేపీ యువ‌జ‌న విభాగం భార‌తీయ జ‌న‌తా యువ మోర్చా నేష‌న‌ల్ యూత్ పార్ల‌మెంట్ ను జేపీ న‌డ్డా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ గా ప్ర‌సంగించారు. కాంగ్రెస్ పార్టీ మాన‌సికంగా దివాళా తీసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ నేష‌న‌ల్ చీఫ్‌.

భార‌త‌దేశంలో ప్ర‌జాస్వామ్యం ముప్పు పొంచి ఉన్న స‌మ‌యంలో రాహుల్ గాంధీ అమెరికా, ఐరోపా దేశాల వంటి విదేశీ శ‌క్తుల‌ను భార‌త్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకునేలా చేశార‌ని మండిప‌డ్డారు జేపీ న‌డ్డా(JP Nadda). దేశంలోని ప్ర‌జ‌లు రాహుల్ గాంధీ మాట‌ల‌ను న‌మ్మ‌ర‌న్నారు. భార‌త ప్ర‌జాస్వామ్య విలువ‌ల గురించి రాహుల్ త‌న సిగ్గు చేటు వ్యాఖ్య‌ల ద్వారా దేశాన్ని అవ‌మానించారు. అంతే కాదు విదేశీ దేశాల‌ను కూడా ఆహ్వానించ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా.

Also Read : క‌ర్ణాట‌క‌లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న

Leave A Reply

Your Email Id will not be published!