Rahul Gandhi : మానవత్వాన్ని మించిన మతం లేదు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
Rahul Gandhi : దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాలంటూ సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన యాత్ర ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ముగిసింది. శుక్రవారం హర్యానాలోకి ఎంటరైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయన యాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. ఎక్కడ చూసినా జనమే జనం..ఇసుక వేస్తే రాలనంతగా తరలి వస్తున్నారు. ఆంగ్లేయుల నుంచి పోరాడి తెచ్చుకున్న భారత దేశం ఇవాళ విద్వేషాలతో, కుల, మతాల పేరుతో రగిలి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశమంటే మనుషులు. అందరికీ కావాల్సింది ఒక్కటే మానవత్వం. మనిషిని మనిషి ప్రేమించ లేని ఏ సమాజం అభివృద్ది చెందిన దాఖలాలు ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . నిత్యం విద్వేషాలతో ఉన్న ఈ సమాజాన్ని సక్రమ మార్గంలో ప్రయాణం చేసేందుకు తాను ఈ భారత్ జోడో యాత్రను చేపట్టానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
అన్ని మతాల సారం ఒక్కటే ప్రతి ఒక్కరు ఇంకొకరిని గౌరవించు కోవాలని చెబుతుందన్నారు. ద్వేషం వల్ల మనస్పర్థలు వస్తాయని అదే కాసింత ప్రేమను పంచితే దేశం ప్రశాంతంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు. ఇలా ఇంకెంత కాలం మతం పేరుతో రాజకీయాలు చేస్తారంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
ఇలాంటి విద్వేష పూరిత రాజకీయాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
Also Read : నితీష్ సమాధాన్ యాత్ర షురూ