Mallikarjun Kharge : మేడం సలహా తీసుకుంటే తప్పేంటి
తాను ఏమీ సిగ్గు పడడం లేదన్న ఖర్గే
Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఎంపీ మల్లికార్జున్ ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. గాంధీ ఫ్యామిలీ సలాహాలు తీసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. తనకు గెలుస్తానన్న నమ్మకం ఉందన్నారు.
అయితే ఎంపీ శశి థరూర్ పై కూడా స్పందించారు. తామిద్దరం ఒకే పార్టీకి చెందిన వారమని, ఇద్దరం సోదరులమన్నారు. ఇది పూర్తిగా స్నేహ పూర్వకమైన పోటీగా మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పేందుకు తాము పోటీ చేయడమేనని పేర్కొన్నారు.
ఇతర పార్టీలలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 17న సోమవారం అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా నెహ్రూ, గాంధీ కుటుంబం దేశానికి ఎనలేని సేవలు అందించిందన్నారు మల్లికార్జున్ ఖర్గే. దేశం కోసం త్యాగాలు చేయని వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారని వాళ్లకు అంత సీన్ లేదన్నారు.
రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతోందన్నారు. తమ యువ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కు అపూర్వమైన రీతిలో ఆదరణ లభిస్తోందన్నారు. పార్టీ వ్యవహారాల నిర్వహణలో గాంధీ కుటుంబం సలహాలు, మద్దతు తీసుకునేందుకు ఎందుకు సిగ్గు పడాలని ప్రశ్నించారు ఖర్గే.
సోనియా గాంధీ గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నారని, ప్రియాంక గాంధీ కష్ట పడుతున్నారని చెప్పారు. తాను రిమోట్ కంట్రోల్ గా ఉంటానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
Also Read : బీజేపీలోకి నేతలు వెళ్లకుండా అడ్డుకుంటా