XI Jinping : ఇక మిగిలింది తైవాన్ ఒక్కటే – జిన్ పింగ్
కీలక వ్యాఖ్యలు చేసిన చైనా దేశ అధ్యక్షుడు
XI Jinping : చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్ పై పూర్తి నియంత్రణ సాధించామని, ఇక మిగిలింది తైవాన్ మాత్రమేనని స్పష్టం చేశారు జిన్ పింగ్. హాంకాంగ్ లో పరిస్థితి గతంలో గందరగోళంగా ఉండేది. కానీ తాను పవర్ లోకి వచ్చాక నియంత్రణలోకి తీసుకు రావడం జరిగిందన్నారు.
ఇక మిగిలింది ఒకే ఒక్కటి తైవాన్ మాత్రమేనని పేర్కొన్నారు జిన్ పింగ్(XI Jinping). దానిని కూడా మెల మెల్లగా చైనా కంట్రోల్ లోకి తీసుకు వస్తామని ప్రతిజ్ఞ చేశారు. తైవాన్ లో వేర్పాటువాదం, ఇతరుల జోక్యానికి వ్యతిరేకంగా ప్రధాన పోరాటం జరుగుతోందన్నారు చైనా చీఫ్. గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా హాంకాంగ్ పై ఫోకస్ ఉండేదన్నారు.
కానీ అక్కడ తాము సమగ్రమైన నియంత్రణను సాధించ గలిగామని , విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించడమే కాకుండా పాలనా పరంగా పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేశామని చెప్పారు జిన్ పింగ్. ఇక తైవాన్ వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా చైనా కూడా పెద్ద పోరాటాన్ని నిర్వహించిందన్నారు.
ప్రాదేశిక సమగ్రతను వ్యతిరేకించగల దృఢ నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు జిన్ పింగ్. ఆదివారం బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులతో జరిగిన కీలక సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఏదో ఒక రోజు తైవాన్ చైనాలో కలవాల్సిందేనని స్పష్టం చేశారు. తమ భూభాగంలో కానీ లేదా తైవాన్ లో దేశమైనా జోక్యం చేసుకోవాలని చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు జిన్ పింగ్.
Also Read : పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన దేశం – బైడెన్