#OneDayCM : ఒక్క‌రోజు సిఎం సృష్టి గోస్వామి తీసుకున్న నిర్ణ‌యాలివి

These are the decisions taken by one day CM Srishti Goswami

OneDay CM : జాతీయ బాలికా దినోత్సవం   సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఒక‌రోజు ప‌నిచేసే అవ‌కాశం అందుకున్న   సృష్టి గోస్వామి రాష్ట్ర వేస‌వి రాజ‌ధాని గైర్‌సెన్‌లో సీఎం ప‌ద‌వి చెప‌ట్టి రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న వివిధ సంక్షేమ పథకాలపై సమీక్ష  నిర్వ‌హించింది . ఈ స‌మీక్షా స‌మావేశానికి అంతా హాజ‌రుకావాలంటూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు మేర‌కు ప్ర‌భుత్వ అధికారులు మంత్రులు హాజ‌ర్యారు.    ఈ స‌మీక్షా స‌మావేశంలో ఆయుష్మాన్‌భవ, స్మార్ట్‌ సిటీ, పర్యాటకతో పాటు ఇతర శాఖల కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సృష్టి సీఎం హోదాలో చర్చించ‌డం విశేషం.

తొలుత ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బాల‌ల కమిషన్ చైర్మన్ ఉషా నేగితో కలిసి అసెంబ్లీకి చేరుకున్న సృష్టికి ముఖ్య‌మంత్రికి ఇవ్వాల్సిన అన్ని ప్రోటోకాల్ ల‌ను సంబంధిత శాఖా మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఆయ‌నే స్వ‌యంగా సృష్టికి పూల బొకేతో సాద‌ర స్వాగతం ప‌లికి ఆమెను విధానసభ రూం నెంబర్ 102 కి తీసుకువెళ్లి అక్క‌డ వివిధ శాఖ‌ల మంత్రుల‌ను అధికారుల‌ను ప‌రిచ‌యం చేసారు. అనంత‌రం ఆమె బాల విధానసభ ఏర్పాటు చేసిన ప్రాంతానికి వ‌చ్చి శాసనసభ్యులు మొదట వివిధ అంశాలపై చర్చించి ప్ర‌ధానంగా రాష్ట్రంలో ఉత్ప‌న్న‌మ‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై తెలుసుకున‌నారు త‌దుప‌రి కృష్టి 13 విభాగాల సమీక్షా సమావేశాన్ని చేపట్టారు.

ఈ సంద‌ర్భంగా    ఉత్త‌రాఖండ్ రాష్ట్ర డిఐజి నీలేష్ భరన్ ని బాలిక‌ల ర‌క్ష‌ణ కోసం ఆదేశాల జారీ రాష్ట్రంలో జ‌రుగుతున్న అత్యాచారాల‌పై సిఎం హోదాలో సృతి చ‌ర్చించడంతో పాటు బాలిక‌ల ర‌క్ష‌ణ కోసం పోలీసులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్ పెరుగుతోంద‌ని బాలికలు పాఠశాలకు చేరుకోవడానికి సురక్షితమైన వాతావరణం క‌నిపించ‌డం లేద‌న్న ఆందొళ‌న వ్య‌క్తం చేసిన ఆమె బాలిక‌ల‌కు త‌క్ష‌ణం ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆదేశాలిచ్చారు. పాఠ‌శాలలతో పాటు ఆయా చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాల‌ని , విద్యార్ధినులు పాఠ‌శాల వ‌చ్చి వెళ్లే వేళ‌ల‌లో కొంద‌రు పోలీసుల‌ను ఆయా ప్రాంతాల‌లో నిఘా వేసాలా చూడాల‌ని సృష్టి డిఐజిని ఆదేశించడం విశేషం.

అలాగే రాష్ట్రంలో మాద‌క ద్ర‌వ్యాల (OneDay CM)విక్ర‌యం పెరుగుతోంద‌న్న‌ ఆందోళ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోందని ప్ర‌ధానంగా విద్యార్ధులు కూడా మ‌త్తు ప‌దార్ధాల‌కు అల‌వాటై జీవితాలు పాడు చేసుకుంటున్న విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని ఆమె డిజిపి సూచించ‌డంతో పాటు విద్యాసంస్థల నుండి 500 మీటర్ల పరిధిలో మాదకద్రవ్యాల అమ్మ‌కాల‌ను పూర్తిగా నిషేధించాలని కోరారు. అలా పేద‌లు సైతం వీటికి బానిస‌ల‌వుతున్న విష‌యం గుర్తించి మురికివాడలో మాదకద్రవ్యాల ను అమ్మే స్మగ్లర్ల పై ఉక్కు పాదం పెట్టాల‌ని ఆదేశించింది. వ‌న్ డే సిఎం ఆదేశాల‌పై స్పందించిన డీఐజీ నీలేష్ భరనే దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇర వేసవి రాజధాని గారిసన్ అభివృద్ధిపై తీసుకున్న చ‌ర్య‌ల వివ‌రాలు చెప్పాల‌ని   సెక్రటరీ జనరల్ ఇన్‌చార్జి వి షణ్ముగంను సృతి ఆదేశాలివ్వ‌టంతో ఆయ‌న గారిసన్ అభివృద్ధి కి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌వ‌ర్ పాయింట్  ప్రెజెంటేషన్ ద్వారా వివ‌రించారు. అయితే ప‌నులు ఆల‌స్యం అవుతున్నాయ‌ని, ఇందుకు కోవిడ్ కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌గా. త్వరిత గ‌తిన ప‌నులు ఆరంభించి వీలున్నంత త్వ‌ర‌గా ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని ఆదేశాలిచ్చారు. రానున్న  వేసవి నాటికి రాజధాని గారిసన్(OneDay CM) లోని  విధాన భవన్‌లో తదుపరి పిల్లల సభను నిర్వహించేలా చూడాల‌ని చెప్పారు.

అనంత‌రం ర‌హ‌దారుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సృతి వ‌ర్షాభావ ప్రాంతాల‌లో ఉన్న బ్రిడ్జిలు ఎప్పుడైనా కూలిపోయే ఆస్కారం క‌నిపిస్తోంద‌ని, రాష్ట్రంలోని శిధిలమైన వంతెనలన్నింటినీ సర్వే చేసి, వెంటనే మరమ్మతులు చేయాలని ల్యాండ్ స‌ర్వే విభాగం అధికారులకు ఆదేశాలిచ్చారు.  అలాగే పిడబ్ల్యుడి శాఖ‌కు స‌ద‌రు వంతెన‌ల మ‌త్తుల‌పై దృష్టి సారించి ప్ర‌జా ర‌వాణా మ‌రింత వేగ‌వంత‌మ‌య్యేలా చూడాల‌ని ఆదేశాలు జారీ చేసారు.

సిఎంగా విధులు పూర్తి చేసాగ సృష్టి గోస్వామి మీడియాలో మాట్లాడుతూ హిందీలో అనీల్ క‌పూర్ న‌టించిన నాయక్ (తెలుగులో ఒకే ఒక్క‌డు) సినిమా చూసాన‌ని ఇలాంటి స‌న్నివేశం నిజ‌జీవితంలో సాధ్య‌మా అనుకుని నేనే సిఎంని అయితే అనుకునే దాన్ని. అయితే నిజంగా నా జీవితంలో వ‌న్‌డే సిఎం కావ‌టం నాకు అంతులేని ఆనందం ఇస్తోంద‌ని చెప్పింది. సీఎం కుర్చీలో కూర్చున్న‌పుడు నాయ‌క్‌లోని అనిల్ కపూర్ నే ఊహించుకున్నాన‌ని వెల్ల‌డించింది. గతేడాదే నాకు 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్పుడు రాష్ట్ర ఓటరు జాబితాలో  నా పేరు చేర్చుకున్నా. ఇది జ‌రిగిన ఏడాదికే ముఖ్య‌మంత్రిగా ఒక రోజు ప‌నిచేసే అవ‌కాశం రావ‌టం ఆనందంగా ఉంద‌ని అన్నారు.

మ‌రోవైపు సమీక్ష సమావేశం(OneDay CM) లో తీసుకున్న నిర్ణ‌యాల‌ను క‌చ్చితంగా అమ‌ల‌వుతాయ‌ని, ఇందుకు సంబంధించిన నివేదికను పిల్లల కమిషన్ ద్వారా చర్యల కోసం ప్రభుత్వానికి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పంపుతార‌ని అన్నారు.

ఈ సమావేశంలో బాల విధాన సభ ప్రతిపక్ష నేత ఆషిఫ్ హుస్సేన్, హోంమంత్రి కుంకుం పంత్ తో పాటు ఎమ్మెల్యేలు హరితిక, మాన్సీ పంత్, చిరాగ్ పంత్, జాన్వి, హరేంద్ర రువాలి పాల్గొన్నారు.

No comment allowed please