Governor RN Ravi : తమిళనాడు పేరు మార్చాలని అనలేదు
గవర్నర్ ఆర్ఎన్ రవి షాకింగ్ కామెంట్స్
Governor RN Ravi : తమిళనాడు వర్సెస్ తమిళగం వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో గెటవుట్ రవి అనే పేరుతో పోస్టర్లు కూడా వెలిశాయి. పొంగల్ సందర్భంగా గవర్నర్ విందుకు డీఎంకే , దాని మిత్రపక్షాలు హాజరు కాలేదు. డీఎంకే ప్రభుత్వ ప్రసంగ పాఠాన్ని చదువుతూ బహిష్కరించి శాసనసభ నుంచి వెళ్లి పోయారు.
ఈ సందర్బంగా ఆర్ఎన్ రవిపై పెద్ద ఎత్తున తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి సంచలన కామెంట్స్ చేశారు. పెరియార్, అంబేద్కర్ ల పేర్లు ఉచ్చరించకుండా అవమానించారని, గవర్నర్ ను కాశ్మీర్ కు వెళ్లగొడతామని హెచ్చరించారు.
దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఆర్ఎన్ రవి(Governor RN Ravi) బుధవారం స్పందించారు. ఈ మేరకు తాను అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ స్పష్టం చేశారు. నా ప్రసంగం ఏమిటో అర్థం చేసుకోకుండా తమిళనాడు అనే పదానికి గవర్నర్ వ్యతిరేకమన్న వాదనలు చర్చకు దారితీసేలా చేశాయని వాపోయారు గవర్నర్.
తన ప్రసంగం ఆధారంగా అర్థం చేసుకోకుండా అనుమతి చేసిన వారు అలా చేశారని ఆరోపించారు . తమిళనాడు పేరును మార్చాలనే సూచన తప్పు, విడ్డూరంగా ఉందన్నారు ఆర్ఎన్ రవి. తమిళ ప్రజలు, కాశీ మధ్య చారిత్రక సాంస్కృతిక అనుసంధానం గురించి మాట్లాడారు. తాను ఈ సందర్భంగా తమిళగం అనే పదాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.
ఆ రోజుల్లో తమిళనాడు అనే పదం లేదన్నారు. తనపై వస్తున్న ప్రచారం తప్పని, అందుకే క్లారిటీ ఇస్తున్నట్లు తెలిపారు గవర్నర్ ఆర్ఎన్ రవి.
Also Read : ఆర్థిక వ్యవస్థపై రాజన్ కామెంట్స్