Komatireddy Rajgopal Reddy : ఇది అధర్మ విజయం – కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Komatireddy Rajgopal Reddy : నన్ను ఒక్కడిని ఓడించేందుకు 100 మంది మోహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, చైర్మెన్లు, ఎంపీపీలు, జేడ్పీటీసీలు ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజల పక్షాన తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను రాజీనామా చేసినందు వల్లనే ఇవాళ మునుగోడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందన్నారు. తన కోసం పని చేసిన బీజేపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు , ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోటీలో నైతిక విజయం తనదన్నారు.
చాలా మంది ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చి నిజం దుర్మార్గంగా విజయం సాధించారని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy). ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నిలదీశారు. మార్షల్స్ ను ప్రయోగించి నన్ను బయటకు పంపించారని తెలిపారు.
కౌరవ సైన్యం వచ్చి నన్ను ఓడించారన్నారు. ప్రజలు ఇవాల్టి తీర్పుతో నా వైపు ఉన్నారని తేలి పోయిందన్నారు. ఫామ్ హౌస్ లో పడుకున్న సీఎం కేసీఆర్ ను , మంత్రులను, ప్రజా ప్రతినిధులను మునుగోడుకు తీసుకు వచ్చిన ఘనత తనదేనని స్పష్టం చేశారు.
ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే రీతిలో లేకుండా పోయిందన్నారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబ పాలనపై పోరాటం చేస్తానని ప్రకటించారు. తాను మడప తిప్పేది లేదన్నారు.
చౌటుప్పల్ లో ఎక్కువగా ఓట్లు వస్తాయని అనుకున్నానని కానీ రాలేదన్నారు.
Also Read : ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం