Harish Rawat : పీఓకేను స్వాధీనం చేసుకునే సమయం ఇదే
సంచలన కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నేత
Harish Rawat : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై సీరియస్ గా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఓకేను వెనక్కి తీసుకునే సమయం వచ్చిందన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ బలహీనమైన స్థితిలో ఉందన్నారు హరీశ్ రావత్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన ప్రకటనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారత్ కు ఇదే కరెక్టు సమయమన్నారు హరీశ్ రావత్(Harish Rawat). పాకిస్తాన్ అక్రమ ఆక్రమణ నుండి పీఓకేను విడిపించడం మన బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము తీర్మానం కూడా చేశామన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఎజెండాలో దీనిని కూడా చేర్చాలని డిమాండ్ చేశారు హరీశ్ రావత్.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే , దానిని అమలు చేసేందుకు భారత సైన్యం సిద్దంగా ఉందని ప్రకటించారు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది.
మరో వైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దీనిని సీరియస్ గా తీసుకున్నారు. కానీ పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్దానికి దిగే పరిస్థితుల్లో లేదు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎప్పుడైనా యుద్దం చేసేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించడంపై భారత్ ఆర్మీ సీరియస్ గా స్పందించింది. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
Also Read : లవ్ జిహాద్ పై చట్టం తీసుకు వస్తాం