Imran Khan : నాపై దాడికి ఆ ముగ్గురే కారణం – ఇమ్రాన్ ఖాన్
మాజీ ప్రధానమంత్రి షాకింగ్ కామెంట్స్
Imran Khan : పాకిస్తాన్ లో లాంగ్ మార్చ్ చేపట్టిన మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పై కాల్పులకు పాల్పడిన ఘటన యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఒక రకంగా అదృష్టం బావుండి బతికి బయట పడ్డారు. ఈ ఘటనలో పీటీఐకి చెందిన నలుగురికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కాల్పులకు తెగబడిన సాయుధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తనపై దాడికి ఆ ముగ్గురే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు ఇమ్రాన్ ఖాన్. ఆయన కుడి కాలులో బుల్లెట్ దూసుకు పోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ మీడియాతో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ లో తన కంటైన్ సమీపంలో దాడికి గురయ్యారు. తనపై దాడికి ఉసిగొల్పింది ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ , ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రితో సహా ముగ్గురి ఆదేశాల మేరకే తనపై బుల్లెట్ల దాడి జరిగిందని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
ఈ విషయాన్ని పీటీఐ నేతలు అసద్ ఉమర్ , మియాన్ అస్లాం ఇక్బాల్ లు కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం తమ నాయకుడు కోలుకుంటున్నాడని, రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే దొడ్డి దారిన దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు.
ప్రధానంగా రాణా సనావుల్లా , మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ కుట్రలో కీలక పాత్ర పోషించారంటూ మండిపడ్డారు. ఆ ముగ్గురిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read : తప్పుదోవ పట్టిస్తున్నందుకే కాల్చా – ఫైజల్