Congress Chief Race : కాంగ్రెస్ చీఫ్ రేసులో ఆ ఇద్దరు
అశోక్ గెహ్లాట్ వర్సెస్ శశి థరూర్
Congress Chief Race : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో(Congress Chief Race) గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధ్యక్ష పదవికి వచ్చే అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.
గాంధీ ఫ్యామిలీ వర్సెస్ గాంధీయేతర నేతల మధ్య పోటీ ప్రధానంగా నెలకొంది. పార్టీ చీఫ్ పదవి కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతర నాయకుడికి పోస్ట్ దక్కనుంది.
గాంధీ కుటుంబానికి విధేయుడైన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ బరిలో ఉండనున్నారు. ఇక ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చిన తిరువనంతపురం శశి థరూర సైతం అధ్యక్ష పదవి రేసులో దిగనున్నారు.
పార్టీలో అంతర్గత సంస్కరణలు ఉండాల్సిందేనంటూ ప్రస్తావించారు. 25 ఏళ్లుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పోటీగా థరూర్ ఉండడం కలకలం రేపుతోంది పార్టీ వర్గాలను. జి23 లేదా 23 మంది సీనియర్ నాయకుల సమూహంలో ఒకరిగా ఉన్నారు ఎంపీ.
ఇదిలా ఉండగా వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు శశి థరూర్. పోటీ చేసేందుకు ఆమె అనుమతి తీసుకున్నట్లు సమాచారం.
ఇక గాంధీ ఫ్యామిలీ విధేయుడిగా పేరొందారు గెహ్లాట్. ఇదిలా ఉండగా గెహ్లాట్ తో పాటు పి. చిదంబరం, తదితర నాయకులంతా రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ కావాలని కోరుతున్నారు.
ఈ మేరకు రాజస్థాన్, చత్తీస్ గఢ్ , బీహార్, తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు తీర్మానం చేశాయి. ఇదిలా ఉండగా పార్టీ చీఫ్ పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చంటూ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పష్టం చేశారు.
Also Read : రాహుల్ కాంగ్రెస్ చీఫ్ కావాలంటూ తీర్మానం