Thota Chandrasekhar : నవ రత్నాల పేరుతో నయవంచన
బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్
Thota Chandrasekhar : ఏపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు భారత రాష్ట్ర సమితి స్టేట్ చీఫ్ తోట చంద్రశేఖర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమం పేరుతో సీఎం జగన్ రెడ్డి మోసం చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చల విడిగా లభ్యం అవుతోందని కానీ చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. దీని వల్ల పెద్ద ఎత్తున యువకులు దాడులకు పాల్పడుతున్నారని, విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు తోట చంద్రశేఖర్.
Thota Chandrasekhar Said
జగన్ సంక్షేమం పేరుతో సంక్షోభ పాలన సాగిస్తున్నారంటూ సెటైర్ వేశారు. గురజాల, విజయవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు తోట సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
యువతకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. భారీగా ఖాళీలు ఉన్నా ఎందుకని భర్తీ చేయడం లేదంటూ ప్రశ్నించారు. నవ రత్నాల పేరుతో నయ వంచన చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు తోట చంద్రశేఖర్(Thota Chandrasekhar). రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , తాము పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ , పని చేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకు వచ్చాడని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ రాక్షస పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమై పోయాయని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు.
Also Read : Ambati Rambabu : పవన్ బ్రో మూవీ అట్టర్ ప్లాప్ – అంబటి
