Hizbul Terrorists : జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో ఎక్కువ కాలం జీవించి ఉన్న హిజ్బుల్ టెర్రరిస్ట్(Hizbul Terrorists) ఉండడం గమనార్హం.
అమర్ నాథ్ యాత్ర మార్గంలో ఉగ్ర దాడులను అరికట్టడంలో భాగంగా శుక్రవారం ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భారత భద్రతా దళాలకు ఇది అతి పెద్ద విజయంగా పేర్కొన వచ్చు.
కాగా ఎన్ కౌంటర్ లో మరణించిన ఈ ముగ్గురు ఉగ్రవాదులు హిజ్జుబల్ ముజాహిద్దీన్ గ్రూప్ నకు చెందిన వారే. భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అష్ట్రఫ్ మోల్వీ ( ట్రెర్రర్ ఔట్ ఫిట్ కు చెందిన సీనియర్ ఉగ్రవాది) తో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులు హతయ్యారు.
యాత్ర మార్గంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ తమకు లభించిన అతి పెద్ద విజయంగా పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ వెల్లడించారు.
ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పహల్గామ్ లోని ఒక అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. నిర్దిష్టమైన అవుట్ పుట్ ఆధారంగా భారత భద్రతా దళాలు కార్బన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఈ ఆపరేషన్ ఎన్ కౌంటర్ గా మారిందని మరో పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా దక్షిణ కాశ్మీర్ లోని పహల్లామ్ అనేది పర్యాటక కేంద్రంగా ఉంది. రెండేళ్ల విరామం తర్వాత జూన్ 30 నుంచి ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ లలో ఒకటిగా ఉంది.
Also Read : పీకేపై నితీష్ కుమార్ ఫైర్