Nobel Prize Physics : ర‌సాయ‌న శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ప్ర‌క‌టించిన స్వీడిష్ నోబుల్ సంస్థ

Nobel Prize Physics : ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన అవార్డుగా భావించే నోబెల్ అవార్డు(Nobel Prize Physics) ప్ర‌క‌టించింది స్వీడిష్ కు చెందిన నోబెల్ సంస్థ‌. 2022 సంవ‌త్స‌రానికి గాను ఇప్ప‌టికే భౌతిక శాస్త్రం విభాగంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నిన్న‌నే అవార్డును ప్ర‌క‌టించింది. తాజాగా కెమిస్ట్రీ విభాగంలో ముగ్గురికి నోబెల్ ఇస్తున్న‌ట్లు తెలిపింది.

క‌రోలిన్ ఆర్. బెర్టోజీ, మోర్టెన్ మెల్డాల్ , కె. బారి షార్ప్ లెస్ ల‌కు నోబెల్ ప్ర‌క‌టించింది. బుధ‌వారం స్టాక్ హోమ్ లోని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఇదిలా ఉండ‌గా 2021లో రసాయ‌న శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తిని శాస్త్ర‌వేత్త‌లు బెంజ‌మిన్ లిస్ట్ , డేవిడ్ డ‌బ్ల్యుసీ మాక్ మిల‌న్ అణువుల‌ను నిర్మించేందుకు ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా ప‌రిశుభ్ర‌మైన మార్గాన్ని కొనుగొన్నందుకు నోబెల్ ప్ర‌క‌టించారు.

ఇక 2020లో జ‌న్యు సాంకేతిక సాధానం జ‌న్యు సంబంధాన్ని ప‌రిశోధించినందుకు ఇమ్మాన్యుయెల్ చార్పెంటియ‌ర్ , జెన్నిఫ‌ర్ డౌడ్నాల‌కు నోబెల్ అవార్డు ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ఫ్రెంచ్ వ్య‌క్తి అలైన్ ఆస్పెక్ట్ , అమెరిక‌న్ జాన్ ఎఫ్‌. క్లౌజ‌ర్ , ఆస్ట్రియ‌న్ ఆంటోన్ జై లింగ‌ర్ క‌లిసి క్వాంటం ఫిజిక్స్ లో చేసిన కృషికి గాను భౌతిక శాస్త్రంలో బ‌హుమ‌తిని గెలుపొందారు .

ఇక నోబెల్ ప్రైజ్ కు సంబంధించి గురువారం సాహిత్యం, శుక్ర‌వారం శాంతి బ‌హుమ‌తి, సోమ‌వారం ఆర్థిక శాస్త్ర రంగాల‌లో నోబెల్ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తారు. $9,00,000 డాల‌ర్ల చొప్పున ఒక్కో విజేత‌కు అంద‌జేస్తుంది నోబెల్ సంస్థ‌. అంటే భార‌తీయ రూపాయ‌ల‌లో లెక్కిస్తే ఒక్కోరికి ఏడు కోట్ల 20 ల‌క్ష‌ల రూపాయ‌లు అందుతాయి.

Also Read : రూ. 48 కోట్ల‌తో మాధురీ దీక్షిత్ ఫ్లాట్

Leave A Reply

Your Email Id will not be published!