Tik Tok Star Shot Dead : సోషల్ మీడియా స్టార్ కాల్చివేత
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర మూకల దురాగతం
Tik Tok Star Shot Dead : కాశ్మీర్ లో వరుసగా కాల్పుల ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని బుద్గామ్ లో 35 ఏళ్ల సోషల్ మీడియా స్టార్ గా(Tik Tok Star Shot Dead) వెలుగొందుతున్న అమ్రీన్ భట్ ను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.
దీంతో కశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆమెను కాల్చి చంపారు. గత 24 గంటల్లో ఇది రెండో దాడి కావడం గమనార్హం. శ్రీనగర్ లో ఓ పోలీస్ ను ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు.
ఈ ఘటన మరిచి పోక ముందే మరో ఘాతుకానికి తెగబడ్డారు పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు. ఈ దాడిలో సోషల్ మీడియా స్టార్ అమ్రీన్ భట్ తో పాటు మేనల్లుడు 10 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డాడు.
ఈ కాల్పులకు పాల్పడింది లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కి చెందిన టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. రాత్రి 7.55 గంటలకు ఉగ్రవాదులు ఆమె ఇంటి వద్దకు వచ్చారు.
విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన అమ్రీన్ భట్ ను , మేనల్లుడిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చని పోయినట్లు ప్రకటించారని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.
అమ్రీన్ భట్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఆమె టిక్ టాక్ ఆర్టిస్ట్ గా(Tik Tok Star Shot Dead), టీవీ స్టార్ గా వినుతి కెక్కారు. అమ్రీన్ భట్ మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీస్ ను కాల్చి చంపగా ఆయన కూతురు అడ్డు కోబోయింది.
ఆమెకు కూడా గాయాలు అయ్యాయి. అమ్రీన్ భట్ ఘటన తర్వాత భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతకు డిసైడ్ అయ్యాయి. ప్రస్తుతం అక్కడంతా టెన్షన్ నెలకొంది.
Also Read : యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు ఖరారు