Tirumala Devotees : తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి హుండీ ఆదాయం రరూ. 2.70 కోట్లు
Tirumala Devotees : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువై ఉన్న క్షేత్రానికి రాను రాను భారీ ఎత్తున భక్తులు దర్శించుకునేందుకు వస్తున్నారు.
తండోప తండాలుగా వస్తున్న భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు నానా తంటాలు పడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). గత రెండు నెలల నుండి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు.
Tirumala Devotees Rush
ఇక దర్శనం విషయానికి వస్తే నిన్న తిరుమల క్షేత్రాన్ని 74 వేల 884 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 213 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక నిత్యం శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.70 కోట్లు వచ్చాయని టీటీడీ వెల్లడించింది.
స్వామి వారి దర్శనం కోసం తిరుమల లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండి పోయాయి. క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ ను దాటింది భక్తుల క్యూ లైన్. ఇదిలా ఉండగా ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దర్శన భాగ్యం 24 గంటలకు పైగా పట్టనుందని టీటీడీ తెలిపింది.
Also Read : Malayappa Rides : గజ వాహనంపై శ్రీవారు కనువిందు