Tirumala Devotees : పుణ్య క్షేత్రం భక్త జన సందోహం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.50 కోట్లు
Tirumala Devotees : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది పుణ్య క్షేత్రం తిరుమల. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. ఈనెల 15 నుంచి శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి.
Tirumala Devotees Huge
ప్రత్యేకించి భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రమైన రోజు శనివారం. దీంతో స్వామి వారి దర్శనం కోసం భక్తుల పోటెత్తారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరిగింది. నిన్న ఒక్క రోజే 72 వేల 309 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామి వారికి 26 వేల 296 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిత్యం శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలకు భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. రూ. 4.50 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో వెల్లడించారు.
తిరుమలలో దర్శనం కోసం భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం కనీసం 5 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.
Also Read : Hamas Attack : ఇజ్రాయెల్ పై దాడుల మోత