Tirumala Devotees : శ్రీవారి ఆదాయం రూ. 3.94 కోట్లు
దర్శించుకున్న భక్తులు 78,726
Tirumala Devotees : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత కొన్ని రోజులుగా ఇదే తీరున వస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో టీటీడీ(TTD) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూసుకుంటోంది. పంధ్రాగస్టు కావడంతో రద్దీ తగ్గుతుందని భావించినా అంతకు మించి భక్త బాంధవులు స్వామి వారి దర్శనం కోసం రావడం విస్తు పోయేలా చేసింది టీటీడీని.
Tirumala Devotees Rush Huge
మంగళవారం శ్రీ వేంకటేశ్వర స్వామిని, శ్రీ అలివేలు మంగమ్మను 78 వేల 726 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 26 వేల 436 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇక ఎప్పటి లాగే తిరుమలలోని 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మరో వైపు ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామి వారి సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 15 గంటలకు పైగా సమయం పట్ట వచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇదిలా ఉండగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. వారందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని ప్రకటించారు.
Also Read : TTD Chairman Bhumana : టీటీడీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్