Tirumala Hundi : శ్రీవారి ఆదాయం రూ.4.26 కోట్లు
తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
Tirumala Hundi : పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)కు భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్తగా శ్రీవారి దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ ఎత్తున భక్త బాంధవులు తిరుమలకు పోటెత్తారు. ప్రతి రోజూ 75 వేల నుంచి 86 వేలకు పైగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
Tirumala Hundi Collection
నిన్న ఒక్క రోజు శ్రీనివాసుడిని 63 వేల 628 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 33 వేల 548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదిలా ఉండగా స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. రూ. 4. 26 కోట్లు హుండీ రూపేణా ఆదాయం సమకూరింది. మరో వైపు భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల లోని బాట గంగమమ్ గుడి వద్ద వరకు వేచి ఉన్నారు.
పుణ్య క్షేత్రం ప్రాంగణంలో టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరికి కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది.
Also Read : Heavy Rains AP Telangana : మరికొన్ని రోజులు భారీ వర్షాలు