Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.40 కోట్లు
దర్శించుకున్న భక్తులు 71,894 మంది
Tirumala Hundi : తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగిసినా భక్త జనసందోహం పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 5.40 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. తిరుమల లోని 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం (టోకెన్లు లేకుండా ) శ్రీవారి దర్శనం కనీసం 12 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది టీటీడీ.
ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఎత్తున హుండీ ఆదాయం సమకూరలేదు. కానీ ఊహించని రీతిలో పెద్ద ఎత్తున విరాళాల రూపేణా సమకూరడం విశేషం. 50 రోజులకు పైగా గడిచినప్పటికీ ఇంకా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. సరికదా ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా భక్త బాంధవులే కనిపిస్తున్నారు.
గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా , నారాయణ నీ నామమే కడు రమణీయం అంటూ భక్తులు పాడుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రమకోర్చి తిరుమల పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. త్వరితగతిన స్వామి వారి దర్శనం అయ్యేలా చేస్తున్నారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఏవో ధర్మా రెడ్డి.
Also Read : Bajrangi Bhaijaan : ఆదరణ తగ్గని భజ్రంగీ భాయిజాన్