Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 45,503
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రంకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామి వారి కృప కోసం బారులు తీరుతున్నారు. కష్టాల నుండి గట్టెక్కించే దేవ దేవుడిగా కొలుస్తున్నారు.
Tirumala Hundi in a Day
గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 45 వేల 503 మంది దర్శించుకున్నారు. 22 వేల 96 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD) వెల్లడించింది.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి. ఏటీజీహెచ్ వరకు భక్తుల లైన్ ఉందని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తిరుమలలో ఆలయ నిర్మాణ పనులు ఉన్న దృష్ట్యా ఈనెల 27న బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు. దీంతో 26న బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించ బోవడం లేదంటూ తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
Also Read : Amit Shah : అమిత్ షా సుడిగాలి పర్యటన