Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.5 కోట్లు
దర్శించుకున్న భక్తులు 58 వేల 874
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది. తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని , కష్టాలు తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. సుదూర ప్రాంతాల నుండి, దేశ, విదేశాల నుండి స్వామి దర్శనం కోసం వారికి పెద్ద ఎత్తున భక్త బాంధవులు తరలి వస్తారు.
Tirumala Hundi Updates
మరో వైపు రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అంతే కాకుండా స్వామి వారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు.
స్వామి, అమ్మ వార్లను 58,874 మంది భక్తులు దర్శించుకున్నారు. 17 వేల 133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.5 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉండగా సర్వ దర్శనం కోసం కనీసం 4 గంటలకు పైగా పట్టే ఛాన్స్ ఉందని టీటీడీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా సామన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Rahul Priyanka Viral : అన్నా చెల్లెలు వైరల్