Tirumala Hundi : భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
రూ.5.32 కోట్లు వచ్చిందన్న టీటీడీ
Tirumala Hundi : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందే తప్పా ఎంతకూ తగ్గడం లేదు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఏకంగా రూ. 5.32 కోట్లు రావడం విశేషం.
Tirumala Hundi with Devotees
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 70 వేల 55 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 724 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వ దర్శనం కోసం 18 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
ఈనెల 18 నుండి 26 వరకు ఎప్పటి లాగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ(TTD) చైర్మన్, ఏవో. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికామని చెప్పారు.
ఆహ్వాన పత్రిక అందజేసినట్లు, సీఎం కూడా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తానని చెప్పినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
Also Read : Undavalli Arun Kumar : బాబుకు జైలు శిక్ష తప్పదు