Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 66,977
Tirumala Hundi : తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల సంఖ్య కొద్ది మేరకు తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం ఊహించని విధంగా పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను కొలిచే భక్త బాంధువులు పెద్ద ఎత్తున కానుకలు, బహుమతులు, విరాళాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గత మే, జూన్ నెలల్లో అత్యధికంగా రోజూ వారీగా శ్రీివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో వేసవి సెలవులు పూర్తయినా ఇంకా తాకిడి తగ్గలేదు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతూనే వచ్చింది.
విచిత్రం ఏమిటంటే జూన్ 6వ తేదీన శ్రీనివాసుడిని, అలివేలు మంగమ్మ అమ్మ వార్లను 66 వేల 977 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 33 వేల 20 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సమర్పించిన కానుకలు , విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 కోట్ల 39 లక్షలు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
తిరుమలకు విచ్చేసిన భక్తులు ఇంకా స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల క్యూ లైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్ద వరకు నిలిచి ఉన్నారు. ఇక సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది.
ఇదిలా ఉండగా వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు.
Also Read : Mahan MJ Comment : ‘సన్యాసి’ గణితంలో ఘనాపాఠి