Tirumala Hundi : శ్రీవారి ఆదాయం రూ. 4.44 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 59,898
Tirumala Hundi : తిరుమలలో కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. గత 70 రోజులుగా భారీ ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. రోజుకు 75 వేలకు మించి భక్తులు దర్శించు కోవడం విశేషం. ఆ మేరకు టీటీడీ కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూసింది. మరో వైపు దర్శన భాగ్యం త్వరగా జరిగేలా చర్యలు చేపట్టింది టీటీడీ.
Tirumala Hundi Collection
కాగా ప్రతి రోజూ లెక్కకు మించి వచ్చిన భక్తుల సంఖ్య నిన్న ఒక్క రోజు మాత్రమే కాస్తా తగ్గింది. శ్రీనివాసుడిని , శ్రీ అలివేలు మంగమ్మను 59 వేల 898 మంది దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 26 వేల 936 కి చేరుకుంది. ఇక భక్తులు తిరుమల లోని 27 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారికి స్వామి దర్శన భాగ్యం కలిగేందుకు కనీసం 15 గంటల సమయం పడుతుందని టీటీడీ(TTD) స్పష్టం చేసింది. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈవో ఏవీ ధర్మారెడ్డి.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రత్యేకించి రెండుసార్లు స్వామి వారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇక పట్టు వస్త్రాలను ఏపీ సీఎం జగన్ రెడ్డి సమర్పిస్తారని తెలిపారు.
Also Read : CM KCR : రూ. 100 కోట్ల ధర పలకడం అభివృద్దికి చిహ్నం
